ప్రముఖ నటుడికి ముప్పు..కులదేవత జోస్యం..
ప్రముఖ కన్నడ నటుడు కాంతార హీరో, డైరక్టర్ రిషభ్ షెట్టి, అతని కుటుంబానికి శత్రువుల వల్ల ముప్పు పొంచి ఉందని వారి కులదేవత పింజుర్లి వారాహి జోస్యం చెప్పింది. మంగుళూరులో జరిగిన కధ్రి బరేబైల్‌లో జరిగిన వారి గ్రామానికి చెందిన వార్షిక ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. తనకు సమస్యలున్నాయని వాటి గురించి పంజుర్లిదేవికి చెప్పారు. కాంతార చిత్రంలోని పంజుర్లి వేషధారిపై దేవత పూనడం తెలిసిందే. అలాంటి ఆచారమే వారి గ్రామంలో పాటిస్తారు. పంజుర్లి వేషధారణలో దేవత మాట్లాడుతూ నీకు చాలామంది శత్రువులు తయారయ్యారని, వారివల్ల నీకు, నీ కుటుంబానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. వారు నీకుటుంబాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు, నిన్ను కాపాడతా, 5 నెలలో మంచి జరిగేలా చేస్తానంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం.

