ఈ సంవత్సరం మిసెస్ ఇండియా హైదరాబాదీనే
కేరళలోని కొచ్చిలో జరిగిన లీ మెరెడియన్ హోటల్‌లో జరిగిన మిసెస్ ఇండియా అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్ గెలుపొందారు. 14 రాష్ట్రాలకు చెందిన మహిళలు పోటీ పడిన ఈ అందాల పోటీలో ఈమె మొదటి ప్రయత్నంలోనే గెలుపొందారు. ఈమె గతంలో మిసెస్ ఇండియాగా గెలుపొందిన రశ్మిక ఠాకూర్ వద్ద శిక్షణ పొందారు. ఈమె తెలంగాణా తరపున ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలను గ్లోబల్ పెగాసిస్ నిర్వహించింది. ఈమె పలు సినిమాలలో కూడా నటించడంతో తెలంగాణా ఫిలిం చాంబర్ సహాయసహకారాలు అందించింది. ఈ పోటీలో మరో రెండు టైటిల్స్‌ను కూడా సాధించారు. వివాహితులైన స్త్రీలకు కూడా వారి ఆత్మవిశ్వాసం, శక్తియుక్తులు, తెలివితేటలు, అందచందాలలో పోటీపెట్టి ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో గెలుపొందిన వారిని మిసెస్ వరల్డ్ పోటీలకు పంపిస్తారు.

