ఈసారి బెట్టింగ్ అక్కడనుండే..
ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకుండానే బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపారు ఏపీ పోలీసులు. దీనితో ఏపీలోని ప్రధాన బుకీలు స్థావరం మార్చుకున్నారు. గతంలో విజయవాడలోని వివిధ ప్రాంతాల నుండి బెట్టింగులు వేసిన వీరిపై వివిధ కేసులు, రౌడీ షీట్లు ఉండడంతో అప్పట్లో విజయవాడ పోలీసులకు చిక్కారు. ఇప్పుడు పోలీస్ నిఘా ఎక్కువ కావడంతో వారు బెంగళూరు, గోవాలలో మకాం వేశారు. అక్కడ నుండి బెట్టింగ్ ముఠాలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అంచనా. వీరిలో ప్రధాన బుకీకి ముబయికి చెందిన బెట్టింగ్ ముఠాతో సంబంధాలున్నాయని సమాచారం. వీరు విజయవాడ నలుమూలలా సబ్ బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లు రావడం వల్ల ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టినా కూడా వారిని పట్టుకోవడం కష్టమవుతోంది.