దిల్‌సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల దోషులకు హైకోర్టు తీర్పు ఇదే..
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చి పాయింట్ల వద్ద రెండు బాంబులు కొద్ది సేపు వ్యవధిలో పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది వికలాంగులయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన 5గురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువడింది. అయితే దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. నేడు ఈ కేసులో తీర్పు వెలువడింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. వారి అప్పీళ్లను డిస్మిస్ చేసింది. దీనిపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వెల్లడించారు. ఉరిశిక్ష పడిన వారిలో అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహమాన్, మహ్మద్ తహసీన్, అజాజ్ షేక్, సాగర్ అలియాస్ ఉన్నారు.

