“ఇది ఎన్డీయే బడ్జెట్..ఇండియా బడ్జెట్ కాదు”: మంత్రి సీతక్క
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు నిధులు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ మంత్రులు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణా మంత్రి సీతక్క కేంద్ర బడ్జెట్‌పై ట్వీట్ చేశారు. ఇది ఎన్డీయే బడ్జెట్..ఇండియా బడ్జెట్ కాదు. ఏపీ,బీహార్ సీఎంలు భయపెడుతున్నారనే వారిపై మోదీ ప్రేమ కురిపించారు. కాగా ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. కేంద్రం నిధుల కేటాయింపులో మరోసారి తెలంగాణాకు మొండిచెయ్యి చూపిండంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణా ప్రజల నుంచి ఓట్లు,సీట్లు మాత్రమే కావాలన్నారు. అయితే తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవంతో వారికి పనిలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.