Andhra PradeshHome Page Slider

లోకేష్ చేసేది మిడ్ నైట్ యాత్ర : పేర్ని నాని

నారా లోకేష్ చేస్తున్నది మిడ్ నైట్ యాత్ర అని మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్ వేశారు. లోకేష్ గుడివాడలో పోటీ చేసి గెలిచే దమ్ముందా అని ఆయన కు సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో లోకేష్ బూతుల సభకు 20 కోట్లు ఖర్చు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు బూతుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ లు మానసిక రోగులుగా మారి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 5200 కోట్లతో ఇవాళ బందర్ పోర్టు నిర్మాణం జరుగుతుందన్నదన్నారు. బందర్ పోర్టుపై అబద్ధాలు మాట్లాడే లోకేష్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.