ఈ తప్పు అందరిదీ..తేల్చిన త్రిసభ్య కమిటీ.
సింహాచలం దుర్ఘటనపై తప్పుకు అందరు ఉద్యోగులు బాధ్యులేనని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందాన సింహాచల ఆలయంలో చందనోత్సవం నాడు గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఈ దుర్ఘటనకు పర్యటకాభివృద్ధి కార్పొరేషన్, దేవాదాయ శాఖ, గుత్తేదార్లు, దేవాలయ సిబ్బంది అందరూ బాధ్యులేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. చందనోత్సవం వేళ లక్షన్నర మంది భక్తులు వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్త చర్యలు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా అధికారులు ప్రవర్తించారని తేలింది. ఒకరిపై ఒకరు నేరాన్ని తోసుకుంటున్నారు. విచారణ కమిషన్ అందరి నుండి లిఖిత పూర్వక వివరాలు సేకరించింది.