‘ఇది నక్సలిజానికి ఎదురుదెబ్బ’..అమిత్ షా
నేడు ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ వంటి కీలక నేతలు కూడా వీరిలో ఉన్నారు. గతంలో వీరిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. భారీ స్థాయిలో ఆయుధాలు పట్టుబడ్డాయి. ఈ విషయంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఘటన నక్సలిజానికి పెద్ద ఎదురు దెబ్బ అన్నారు. నక్సలిజం దేశంలో చివరి దశలో ఉందని, త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది మన భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.

