HealthHome Page SliderInternationalNews Alert

వారికి 80 ఏళ్ల వరకూ తెల్లజుట్టు రాదట..

నల్లని మబ్బులాంటి కురులు కావాలని అమ్మాయిలందరూ కోరుకుంటారు.  చైనాలోని రెడ్ యావో అనే జాతికి చెందిన మహిళలకు 80 ఏళ్ల వరకూ సహజంగానే జుట్టు తెల్లబడదట. అంతేకాదు ఈ ఊరే మహిళల పేరుతో లాంగ్ హెయిర్ విలేజ్‌గా పేరు పొందింది. వారికి పొడవాటి నల్లటి కురులుండడమే కారణం. ఆ పొడవైన కురులే వారికి దీర్ఘాయుష్షు, శ్రేయస్సును అందిస్తాయని వారి నమ్మకం. ఇలా నల్లని జుట్టు కోసం వీరు వాడే సీక్రెట్ ఫార్ములాను వారు ఇలా చెప్తారు. బియ్యం కడిగిన నీరు తీసుకుని, గది ఉష్ణోగ్రత వద్ద పులిసే వరకూ ఒకరోజు ఉంచుతారు. దానిలో కొన్ని మూలికలు కలిపి ఉడికించి చల్లారబెడతారు. ఆ మిశ్రమాన్ని కుదుళ్ల వద్ద ఉంచి చివరి వరకూ ఒక చెక్క దువ్వెనతో దువ్వుతారు. ఈ పొడవాటి వెంట్రుకల విషయంలో వారికి గిన్నిస్ రికార్డు కూడా ఉండడం విశేషం. 250 మంది మహిళలు కలిసి ఒక గొలుసుగా ఏర్పడి దానిని సాధించారు. వీరు పవిత్రమైన అంశంగా చూసే ఈ జుట్టు విషయంలో చాలా ఆంక్షలు పాటిస్తారు.