లోకేష్ కు మంచి పదవి అప్పగించే అవకాశం ఉంది.. ఎమ్మెల్యే శ్రావణి
మహానాడులో నారా లోకేష్ కు మంచి పదవి అప్పగించే అవకాశం ఉందని శింగనమల ఎమ్మెల్యే శ్రావణి అన్నారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో పార్టీ శ్రేణులకు లోకేష్ ముందున్నారని పేర్కొన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి లోకేష్ అని ఆమె కొనియాడారు. లోకేష్ ను మంచి పొజిషన్ లో చూడాలని ప్రజలతో పాటు మేము కూడా ఆశపడుతున్నామని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు.