BusinessHome Page SliderNationalNews AlertTrending Today

బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు

భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. బంగారు నగల్ని పారంపర్యంగా తమ వంశం వారికి అందిస్తూ ఉంటారు. బంగారం కేవలం పెట్టుబడి కోసమో, వ్యాపార ధోరణితోనో కాకుండా పండుగలకు, శుభకార్యాలకు ప్రేమకి,అనుబంధానికి ప్రతిరూపంగా కొనుగోళ్లు చేస్తూంటారు. అలాంటిది ఇప్పుడు బంగారం అంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షా 16 వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. గత రెండు మూడు రోజులుగా చూస్తే దాదాపు తులంపై 2000 రూపాయలకుపైగానే ఎగబాకింది. ధర పెరిగిన తర్వాత మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410 ఉంది. ఇక వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇది కూడా వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్ష 50 వేల రూపాయల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనత, క్రూడ్ ఆయిల్ ధరల ఊగిసలాటల కారణంగా ఈ పెరుగుదల ఏర్పడింది.
దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా బంగారానికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. రాబోయే వారాల్లో ధరలు ఇంకా పెరగవచ్చని అనలిస్ట్‌లు చెబుతున్నారు. పండుగల ముందు బంగారం కొనుగోలు చేసేవారు మార్కెట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం మంచిది. బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌ మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌ మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది. ప్రముఖ నగరాలలో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,560
– 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860
ముంబై:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710
హైదరాబాద్‌:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410
– 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710
విజయవాడ:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410
– 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710
చెన్నై:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,740
– 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,010
బెంగళూరు:
– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410
– 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710