Andhra PradeshHome Page Slider

వైసీపీ ఎమ్మెల్యేకు పరాభవం,చెప్పులతో దాడి చేయించిన సొంత పార్టీ నేత

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం
పెనుగొండలో చెప్పులతో దాడి
బట్టలూడదీసి కొట్టేవాళ్లమంటూ
గర్జించిన సొంత పార్టీ నేత

పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ఘోర పరాభవం జరిగింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదుల బలాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. రేణుక నగర్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా నిలబడి శంకరనారాయణ వాహనాన్ని అడ్డుకున్నారు. శంకరనారాయణ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో వాహనాన్ని వెనక్కి తిప్పుకుని శంకరనారాయణ వెళ్లిపోయారు.

పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై దాడి చేయించింది మరెవరో కాదు. సొంత పార్టీ నేత నాగభూషణ రెడ్డి. ఈ వ్యవహారంపై నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈదులబలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. ఐదు నెలలు గ్రామంలో రేషన్ సరుకులు వేయలేదన్నారు. గ్రామస్తులను అవమానిస్తున్నాడని… వైసీపీ మీద అభిమానంతో వదిలిపెట్టామన్నారు. లేకుంటే ఎమ్మెల్యే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్ళమంటూ నాగభూషణ్ రెడ్డి హెచ్చరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఈదులబలాపురం గ్రామానికి పోలీసులు చేరుకున్నారు.