ఇకపై కరోనాకు అంత సీన్ లేదు- WHO
ఇకపై కరోనా ఎంతమాత్రం విపత్తుగా పరిగణించనక్కరలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. కరోనాకు మహమ్మారిగా మారేంత సీన్ లేదని తేల్చి చెప్పింది. ఇది పాండమిక్ స్థాయిని ఇకపై చేరుకోలేదని కొవిడ్ మహమ్మారి ఆవిర్భవించిన మూడేళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా ప్రకటించారు. ఈ వైరస్ వల్ల చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. ఇప్పటి వరకూ 20 లక్షల మందికి పైగా ప్రజలు కొవిడ్ సోకి చనిపోయారని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్క చెప్పింది. ఇకపై ఇది ప్రాణాలు తీసేంత వ్యాధి కాదని ఎండమిక్ దశలో ప్రవేశించి సాధారణ ఫ్లూ జ్వరంగా మిగిలిపోతుందని తెలియజేశారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ఇప్పడి వరకూ 13 బిలియన్ల మంది ఈ కొవిడ్ వాక్సిన్ వేసుకున్నారని, వారికి ప్రాణాంతక వ్యాధి నుండి ముప్పు తప్పినట్లేనని ప్రకటించింది. కానీ ఈ వాక్సిన్ ఇంకా చాలా పేద దేశాల వారికి అందుబాటులో రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చాలా సందర్భాలలో మహమ్మారులు మరో మహమ్మారి విజృంభించే దశ వరకు మనుగడలో ఉంటాయని, వేరొక పాండమిక్ ప్రారంభం కాగానే ముగిసి పోతాయని వ్యాఖ్యానించారు

