కన్నులపండుగ చేస్తున్న ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’
భూలోక స్వర్గమా అనిపించే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈ ఏడాది సందర్శకుల కన్నులపండుగ చేయడానికి సిద్ధమయ్యింది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’నేషనల్ పార్క్ను ఆదివారం తెరిచారు. ఇందులో బ్రహ్మ కమలం, బ్లూ పాపీ, కోబ్రా లిలీ బ్లూమ్ వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన అనేక అరుదైన పూలు, వృక్ష జాతులున్నాయి. ఈ పూదోట సందర్శనకు ఆదివారం 83 మం ది పర్యాటకులకు మొదటిసారిగా అనుమతిచ్చామని ఫారెస్ట్ రేంజ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేషనల్ పార్క్ ఏటా జూన్ నుంచి అక్టోబర్ వరకు తెరిచి ఉంచుతారు.

