ఎద్దును చంపిన పులి
నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని ఆ జిల్లా వాసులు ఆందోళన చేసినా పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ఇప్పుడది ఏకంగా జనావాసాల్లోకే వచ్చేసింది. మామడ మండలం బుర్కరేగడి గ్రామంలో పశువుల పాకలో పశుగ్రాసం మేస్తున్న ఎద్దుపై దాడి చేసింది. పదునైన పంజాలతో చీల్చి చండాడింది. ఎద్దును చంపి లాక్కెళ్లింది.కొంత దూరం వెళ్లాక కళేబరాన్ని వదిలి పారిపోయింది.ఇదంతా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు,పశువుల కాపరులు,పశుపోషకులు, పలువురు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సమాచారాన్ని అటవీ అధికారులకు తెలిపారు.పెద్దపులి బారీ నుంచి తమని కాపాడాలని వేడుకుంటున్నారు.ఈ నేపథ్యంలో పులి ఆనవాళ్లు కనుగొనే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

