Andhra PradeshHome Page Slider

టమాటో రైతును గొంతుకోసి చంపిన దుండగులు

అన్నమయ్య జిల్లాలో టమాట రైతును  దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన జరిగింది. మధుకర్ అనే రైతు తాను పండించిన టమాటో పంటకు కాపలాగా  రాత్రిపూట పొలం వద్దే నిద్రపోయారు. నవాబుకోట అనే ప్రాంతం వద్ద మధుకర్ పొలం ఉంది. టమాటోకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ఈ పంటకు కాపలాగా ఉండవలసి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పొలం వద్దకు వచ్చి కాపలాగా పడుకున్న రైతును అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపుతోంది. టమాటో సాగు చేసిన ఆ పొలంలోనే విగత జీవిగా మారడం గ్రామంలో విషాదం నెలకొంది. ఈ మధ్య కాలంలో టమాటోలు సాగుచేసి కోటీశ్వరులైన రైతుల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కాగా టమాటో ధరలు రోజురోజుకీ పైకి ఎగబాకుతున్నాయి.