crimeHome Page SliderNationalNews Alert

వాట్సాప్ వెనుక ముప్పు..ఇది ఓపెన్ చేయొద్దు.

కేరళ పోలీసులు ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక స్కామ్‌ను గుర్తించారు. వాట్సప్‌లో వచ్చిన ఫోటోలను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్‌లో ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. ఈ స్కామ్ వెనుక ఉన్న టెక్నాలజీ పేరు స్టెగానోగ్రఫీ. దీని సహాయంతో హానికరమైన కోడ్‌ను చిత్రాలలో దాచి ఉంచుతారు. ముఖ్యంగా “LSB స్టెగానోగ్రఫీ” అనే విధానంలో ఇది పనిచేస్తుంది. ఫోటోని తక్కువ ముఖ్యమైన పిక్సెల్స్‌లో కప్పివేస్తారు. మీరు చూసే ఫోటో సాధారణంగా కనిపించినా, తెరవగానే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్‌లోని పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, ఓటీపీలు అన్నీ నేరస్థుల చేతుల్లోకి వెంటనే వెళ్లిపోతాయి. ఇప్పటివరకూ మనకు తెలిసిన సైబర్‌ మోసాలు లింక్ క్లిక్ చేయడం ద్వారా జరిగినవే తెలుసు. ఇది అంతకు మించిన మోసం. ఇక్కడ లింక్ అవసరం లేదు, లాగిన్ అవసరం లేదు.  అందుకే మీకు తెలియకుండా అలాంటి వీడియోలు, ఫోటోలు డౌన్‌లోడ్‌ కాకుండా మీ ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే మంచిదని సూచించారు.