అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని డస్ట్‌బిన్‌లో పెట్టిన టీచర్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అల్లరి చేస్తున్నాడని ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. సక్కినేటిపల్లి మండలం వీవీమెరక MPP స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. ఈ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న గడ్డం రాజమౌళి అనే 10 సంవత్సరాల బాలుడి పట్ల టీచర్ క్రూరంగా ప్రవర్తించాడు.

అల్లరి చేస్తున్నాడనే కారణంతో టీచర్ విద్యార్థిని డస్ట్‌బిన్‌లో పెట్టి 10 నిమిషాలపాటు మూత ఉంచాడు. కాగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థి స్కూల్లో జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులతో కలిసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. స్కూల్ టీచర్‌పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైవ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

