Home Page SliderInternationalSports

సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలంక కెప్టెన్

శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన న్యూజిల్యాండ్ vs శ్రీలంక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమిపాలయ్యింది.దీంతో శ్రీలంక టెస్ట్ కెప్టెన్ కరుణరత్నే తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఐర్లాండ్‌తో 2 టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28 ) అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా ఈ విషయాన్ని ఆయన శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే 2019లో శ్రీలంక జట్టు టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన కరుణరత్నే తొలి సిరీస్‌లోనే సౌతాఫ్రికాపై చారిత్రక విజయం సాధించారు.