గాజాలో దారుణ పరిస్థితి…10లక్షల మంది నిరాశ్రయులు
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధంలో నలిగిపోతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా ఉన్న గాజాలో 20 లక్షల మంది జనాభాలో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. అక్కడ సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలను తరలించడానికి కూడా వీలు లేకుండా ఉగ్రదాడులు, మిస్సైల్ దాడులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈజిప్టు నుండి రఫా బోర్డర్‌ను తెరిచే అవకాశం ఉందని, అనంతరం వైద్యసదుపాయాన్ని అక్కడి ప్రజలకు అందజేస్తామని తెలియజేసింది.

