Home Page SliderTelangana

తెలంగాణాలో రేపు రెండో విడత రుణమాఫీ విడుదల

తెలంగాణాలో రైతులకు రేవంత్ సర్కార్ రేపు రెండో విడత రుణమాఫీని విడుదల చేయనుంది.కాగా రేపు తెలంగాణా అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో సీఎం బటన్ నొక్కగానే రుణరైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.కాగా ఈ విడతలో రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య రుణాలు మాఫీ కానున్నాయి. అయితే దీనికి తెలంగాణా ప్రభుత్వం ఈసారి 7 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణాలోని 6.50లక్షలమంది రైతులు లబ్ది పొందబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.