Home Page SliderTelangana

బీఆర్ఎస్,బీజేపీల బంధం ఫెవికాల్ లాంటిది: రేవంత్

టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..దేశంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల బంధం ఫెవికాల్ లాంటిదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు తొమ్మిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయని ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. కాగా ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటిపై దృష్టి మరల్చేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వచ్చే నెల 2న ఖమ్మంలో జరిగే సభతో తెలంగాణాలో ఎన్నికల భేరీ మోగిస్తామని రేవంత్ ప్రకటించారు. కాగా ఖమ్మంలో నిర్వహించబోయే ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని రేవంత్ వెల్లడించారు. దీంతో తెలంగాణాలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా తెలంగాణాలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.