Home Page SliderTelangana

కాంగ్రెస్ పాలకులకు అసలు ఆట ఇప్పుడు మొదలైంది:కేటీఆర్

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా తొలి కేబినెట్ భేటీలోనే 6 గ్యారంటీలకు చట్ట భద్రత కల్పిస్తామన్న మాట ఏమైందని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.కాగా  కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదన్నారు. అయితే కాంగ్రెస్ పాలకులకు అసలు ఆట ఇప్పుడు మొదలైందని అని కేటీఆర్  ఎద్దేవా చేశారు.