నవంబర్‌లో 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని
హైదరాబాద్: నవంబర్ 25 నుండి 3 రోజులపాటు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో సభ నిర్వహించిన మోడీ నేడు మళ్లీ రానున్నారు. ఇక 25 నుండి అయితే మూడు రోజుల పాటు ఇక్కడ బసచేసి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్‌లో జనగర్జన సభలో పాల్గొంటారు. 27న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్ షోలోనూ పాల్గొంటారు. ఎల్బీనగర్ నుండి పటాన్‌చెరు వరకూ మోడీ రోడ్‌షోకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.


 
							 
							