Home Page SliderInternational

గూగుల్ నుండి కొత్త ఏఐ వెర్షన్ గూగుల్ జెమిని

గూగుల్ జెమిని పేరుతో అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్‌ను గూగుల్ ప్రపంచానికి అందిస్తోంది. మూడు వేరియంట్లలో దీనిని తీసుకువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రతీ ప్రశ్నకు గూగుల్ జెమిని వద్ద సమాధానం లభిస్తుందన్నారు. ఆడియో, వీడియో, కోడింగ్ వంటి సమాచారాన్ని 90 శాతం ఖచ్చితత్వంతో తెలియజేస్తుందన్నారు. ఈ జెమిని 10 వెర్షన్‌ను జెమిని ‘ఆల్ట్రా’, ‘జెమిని ప్రో’, ‘జెమిని నానో’ వంటి పేర్లతో డేటా సెంటర్ల నుండి మొబైల్ డివైజ్‌ల వరకూ అన్నింటిలో పని చేస్తుందని గూగుల్ సీఈవో తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని, హోంవర్కులో సహాయపడుతుందని తెలిపారు. దీనిని ప్రస్తుతానికి ఇంగ్లీషు భాషలోనే అందుబాటులో ఉందని, త్వరలోనే ప్రాంతీయ భాషలలోకి తీసుకొస్తామని తెలిపారు.