ఫిరాయింపుదారుల కుట్ర వల్లే మర్డర్ జరిగింది..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న మారు గంగారెడ్డి మర్డర్ జిల్లాలో సంచనంగా మారింది. హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జీవన్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుదారుల కుట్ర వల్లే ఈ మర్డర్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులకు జిల్లాలో రక్షణ లేదని, గంగారెడ్డిని చంపితే తనను చంపినట్లుగానే భావిస్తున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. గత మూడు నెలలుగా కాంగ్రెస్ లో అవమానాలతోపాటు మానసిక క్షోభకు గురవుతున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ అవసరం లేకున్నా వలసలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా 10 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఘాటుగా స్పందించారు.

