Breaking NewscrimeHome Page SliderTelangana

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందాడు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో.. వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి చెట్టును డీకొట్టింది.దీంతో లారీ క్లీన‌ర్‌ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.డ్రైవ‌ర్‌ కి తీవ్ర గాయాల‌య్యాయి. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది.క్లీన‌ర్‌ కూడా కేబిన్‌లో నే ఇరుక్కుపోయాడు.మృత‌దేహాన్ని వెలికి తీయ‌డానికి గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ట్రాఫిక్ ని క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు.