Home Page SliderTelangana

రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి స్వగ్రామం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సోలరైజ్డ్ విలేజ్‌గా ఈ గ్రామం చరిత్ర సృష్టించబోతోంది. ఈ గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలరైజ్డ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామంలో 500 గృహాలు, 66 కమర్షియల్ ప్రాంతాలతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులకు కూడా ఈ విద్యుత్ వెలుగులు అందనున్నాయి. అధికారులు స్థానిక ప్రతినిధులతో మాట్లాడి, పైలట్ ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అవసరమైన సౌరవిద్యుత్ కెపాసిటీని అంచనా వేస్తున్నారు.