Home Page SliderNational

ఏపీ మాజీ సీఎం కేసులపై రోజువారీ విచారణ చేపట్టనున్న హైకోర్టు

ఏపీ మాజీ సీఎం జగన్‌పై మళ్లీ కేసుల ఉచ్చు బిగుస్తోంది. కాగా ఇప్పటికే సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణా హైకోర్టు తాజాగా ఆదేశించింది.జగన్ కేసుల అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య గతంలో తెలంగాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణా హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ విచారణలో జగన్‌పై ఉన్న అన్ని కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని ధర్మాసనం తీర్పు నిచ్చింది. అయితే ఎక్కువ కేసులున్నందు వల్ల వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని తెలంగాణా హైకోర్టు సూచించింది.