Home Page SliderNationalPolitics

పఠాన్‌ సినిమా నిషేధంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Share with

బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణే నటించిన పఠాన్‌ సినిమాపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని పలువురు నాయకులు, ఇతర సంఘాలు పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో హీరోయిన్‌ కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ నేతలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా పార్టీ నేతలకు సూచనలు చేశారు. మోదీ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని హితవు పలికారు. కానీ నేడు ఊహించని పరిణామంలో ప్రధాని తన సొంత మంత్రులను సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా పనిపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. సినిమాలపై నాయకులు చేసే కామెంట్లను మీడియా హైలెట్‌ చేస్తోందన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొని మాట్లాడారు. మరోవైపు.. 8 రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఓవర్సీస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్ కు ఉన్న అపూర్వమైన క్రేజ్ నుంచి దేశీయ మార్కెట్ లో భారీ అంచనాల వరకు ఈ సినిమా ఆగేలా కనిపించడం లేదు.