Breaking NewscrimeHome Page SliderNews AlertTelangana

రైతుభ‌రోసాకి స‌ర్కారు వారి మెలిక‌

బీఆర్ ఎస్ హ‌యాంలో రైతు భ‌రోసాకి ష‌ర‌తుల్లేకుండా ప‌థ‌కానికి సంబంధించిన ఫ‌లాల‌ను వ‌ర్తింప‌జేస్తే.. కాంగ్రెస్ హ‌యాంలో అర్హ‌తల కొర్రీలు పెడుతున్నార‌ని మాజీ మంత్రి కేటిఆర్‌, హ‌రీష్ రావులు విమ‌ర్శించారు.ప్రతీ సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ప్ర‌మాణ ప‌త్రాలు ఇవ్వాల‌ని ,విధిగా ఆన్ లైన్‌లో న‌మోదు చేసుకోవాల‌ని చెప్ప‌డం అంటే అన్న‌దాత‌ల‌కు ఇవ్వాల్సిన భ‌రోసాని ఎగ్గొట్డడానికే అని విమ‌ర్శించారు.రేవంత్ స‌ర్కార్‌..దురుద్దేశ్య‌పూర్వ‌కంగా రైత‌న్న‌ల నోళ్ల‌లో మ‌న్నుకొడుతుంద‌ని ఆరోపించారు. రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ స్థాయి అధికారులతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశాకే రైతు భ‌రోసా ఇస్తాం అనే క‌ఠినత‌ర నిబంధ‌న త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని వారు డిమాండ్ చేశారు. తోటలకు ఒకసారే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీలో సిఫార్సుల‌ను కూడా ఆమోదించ‌డాన్ని వారు త‌ప్పుబ‌ట్టారు.