ఆస్తి పంపకాలు తేలలేదని అంత్యక్రియలు ఆపేశారు
ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు.దీంతో చేసేది లేక మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్ బాడీని అంత్యక్రియలు జరగకుండా ఉంచారు వెలికట్టె యాదగిరి (55) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు కొడుకు రమేశ్ ఉండగా రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి ఉన్నారు.అయితే రెండో భార్య పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన రెండు ఎకరాల విషయం తేల్చిన తర్వాత తండ్రికి అంత్య క్రియలు చేసేది లేదని కొడుకు రమేశ్ పట్టుబట్టాడు. గ్రామస్తులు కూడా రమేశ్ కే మద్దతు పలకడంతో మూడు రోజులుగా యాదగిరి డెడ్ బాడీ ఇంటి ముందే ఉంది .