Andhra PradeshNews Alert

తగ్గేదేలే అంటున్న ‘ఈగ’ క్రేజ్

విజువల్ వండర్ , ఐ ఫీస్ట్  అనే పదాలకు అర్థం చెప్పేలా నిర్మించిన చిత్రం ‘ఈగ’. మూవీ హీట్ అవ్వాలి అంటే పెద్ద హీరోలే ఉండాల్సిన అవసరం లేదు…చిన్న ఈగతోనూ సినిమా సూపర్ హిట్‌గా సృష్టించవచ్చు అని రాజమౌళి నిరూపించారు. ఇప్పటికి ఈ సినిమా రీలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. అయితే అమెరికాలో జరిగిన బియాండ్ ఫెస్ట్‌లో దర్మకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్మించారు. కాగా ఈ సినిమాలోని సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యంతో దీనికి మరోసారి బ్రహ్మరథం పట్టారు. కరతాలధ్వనులతో అక్కడి ప్రాంగణాన్ని హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోని చూసిన చిత్రబృందం వారు దానిని షేర్ చేస్తూ మూవీ టైంలో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

ఈ వీడియోని ట్విట్టర్‌లో నాని పోస్ట్ చేస్తూ “ఈ సినిమా విడుదలై దశాబ్దకాలం అయ్యింది. దేశం కానీ దేశంలో కూడా ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే 2012లో ఈగ సినిమా ఫస్ట్ డే , ఫస్ట్ షో చూసిన రోజులు గుర్తొస్తున్నాయి” అని రాసుకొచ్చారు. అలానే విలన్ క్యారెక్టర్ పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ వీడియో పై స్పందిస్తూ “చాలా తక్కవ సినిమాలు మాత్రమే ఎన్ని సార్లు చూసిన మళ్లీ చూడాలనిపిస్తాయి. రాజమౌళి సార్‌కు , ఈగ టీమ్‌కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు 2 జూతీయ అవార్డులు , 3 సైమా అవార్డులు , 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.