కర్నూలులో రైతుల వజ్రాల వేట
రూపాయి… రెండ్రుపాయలు కాదు.. లక్షలు పలికే వజ్రాలవి… పంటపొలాల్లో దొరికితే ఇక రైతుల ఆనందానికి అంతేముంటుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో అద్భుతం చోటుచేసుకుంది. ఓ వ్యవసాయకూలి తన పనుల నిమిత్తం పొలానికి వెళ్తే వజ్రం దొరికింది. దానిని స్థానిక వ్యాపారి వద్దకు తీసుకెళ్లి అమ్మే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆ వజ్రానికి అతనికి లక్షా 50 వేలు లభించాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ ప్రజలు వజ్రాలు వెతికేందుకు పరుగులు తీస్తున్నారు. ఎటుచూసిన గుంపులు గుంపులుగా వెళ్తూ పొలాలను జల్లెడ పడుతున్నారు. ఇక ఆ చుట్టూ పక్కల ప్రాంతం ప్రజలు కూడా ఈ వార్త తెలిసి వజ్రాల వేటకు బయలుదేరారు.