Home Page SliderTelangana

ప్రాజెక్టుల లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి

వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులపై ఇంజినీర్ల అనుమానాలు నిజమేనని స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులపై ఇంజినీర్ల అనుమానాలు నిజమేనని నేటికి అర్థమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగడం ఆందోళనకరమని తెలిపారు. రూ. లక్షన్నర కోట్ల ప్రాజెక్టు దెబ్బతింటుంటే ప్రభుత్వం మాట్లాడకుండా ఉండిపోయింది. అంచనాలు భారీగా పెంచి నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. ప్రారంభించిన మూడేళ్లలోనే పిల్లర్లు కుంగిపోవడం దారుణాతి దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డ్యాం సేఫ్టీ అథారిటీతో పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం పద్మశాలి సంఘ జాతీయ నాయకుడు, జగిత్యాల జిల్లాకు చెందిన సంకు సుధాకర్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్‌లతో కలిసి కిషన్‌రెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ నిపుణుల మాటలు పక్కనపెట్టి ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు.