మూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నాడు..
వికారాబాద్‌లో నెలకొల్పబోయే వీఎల్‌ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఒకవైపు మూసీ నదికి ముఖ్యమంత్రి మరణశాసనం రాస్తూ, మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించింది. ఈ ప్రాజెక్టు వల్ల మూసీనది అంతరించిపోతుందని, అందుకే పదేళ్లపాటు తమపై ఒత్తడి తెచ్చినా తమ ప్రభుత్వ కాలంలో దీనిని ఆమోదించలేదని పేర్కొంది. దామగుండంలో ఏర్పాటు చేయబోయే రాడార్ వల్ల పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.. 12 లక్షల చెట్లను నరికి, 2900 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని మండిపడ్డారు. జనావాసాలు లేనిచోట్ల ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలని, పచ్చని ప్రకృతిని నాశనం చేస్తామంటే పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. గంగానదికి 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో జోన్‌గా ప్రకటించారని, ‘గంగకు ఒక రూల్, మూసీకి ఒక రూలా?’ అంటూ ప్రశ్నించారు.

