కేంద్రం పద్దతేం బాగోలేదు..మంత్రి సీతక్క
కేంద్రం కగార్ ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై వ్యవహరిస్తున్న పద్దతేం బాగోలేదన్నారు. కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, కేంద్ర బలగాల ఆంక్షలతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు కురిపించారు. ఆదివాసీలు జీవనాధారం కోల్పోయేలా, కేంద్ర బలగాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలని, ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలి మంత్రి సీతక్క డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు రెండు గుట్టలు తమ స్వాధీనం చేసుకున్నారు. కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగురవేశారు. భద్రతా బలగాలు ఈ ప్రదేశంలో శాశ్వత బేస్ క్యాంప్‌లు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుకే కర్రెగుట్టలో 20 వేల మందికిపైగా బలగాలను మోహరించారు. ఇప్పటి వరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లభించలేదు.

