Home Page SliderInternational

మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్‌.. తర్వాత ఏమైందంటే..?

బ్రెజిల్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో కలిసి ఓ మహిళ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తన ప్యాంట్ లోని మొబైల్ ఒక్కసారిగా పేలింది. వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆమె బ్యాక్ ప్యాకెట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడులో మహిళ వెనుక భాగంతో పాటు, చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మొబైల్ ఫోన్ పేలిన దృశ్యాలు సూపర్ మార్కెట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.