Home Page SliderNationalNews Alert

ఒక్కసారిగా పేలిపోయిన సెల్‌ఫోన్‌.. తప్పిన పెను ప్రమాదం..

Share with

ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ వాడకం చాలా పెరిగిపోయింది. దీనిని వాడుతున్న వారు రోజు రోజుకి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్‌ ఫోన్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. తరుచూ ఛార్జింగ్‌ పెట్టడం, బ్యాటరీ జీవిత కాలం ముగిసినా కూడా దానిని వినియోగిస్తుండడం లాంటి చర్యల ద్వారా మొబైల్‌ ఫోన్‌ పేలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి ఓ సంఘటన కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 70 ఏళ్ల పెద్దాయన ఓ హోటల్లో కూర్చుని ఏదో తింటున్నారు. ఆయన చొక్కా జేబులో సెల్‌ఫోన్‌ పెట్టుకున్నారు. ఉన్నట్టుండి అది పేలిపోయి మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన రెండు చేతులతో దులిపేసుకోవడంతో సెల్‌ఫోన్‌ కింద పడిపోయింది.  దీంతో ఆయన చొక్కా కాలిపోయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి నీళ్ళు చల్లి సెల్‌ఫోన్‌ మంటను ఆర్పేశాడు. అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.