చట్నీస్ పై కేసు
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ టీం, పోలీసులు నగరంలోని పలు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ శరత్ సిటీ మాల్ లోని చట్నీస్ హోటల్ లో సోదాలు చేశారు. తనిఖీల్లో కందిపప్పులో బొద్దింకలు ఉండటం గమనించారు. గోధుమపిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారింది. కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు, క్యాబేజీలను వాడుతున్నట్టు నిర్ధారించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు గుర్తించి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.