Home Page SliderNational

కనురెప్పలు కోల్పోయిన నటి ఆవేదన

బాలీవుడ్ నటి హీనా ఖాన్ బ్రెస్ట్ కేన్సర్ బారిన పడింది. ఆమె ఇప్పటికే స్టేజి 3లో ఉండడంతో ఆమెకు కఠినమైన చికిత్సలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కీమోథెరపీ జరుగుతోంది. దీనితో ఆమెకు ఇప్పటికే జుట్టు ఊడిపోయింది. తాజాగా ట్రీట్‌మెంట్‌లో తన కనురెప్పలను కూడా కోల్పోయినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఫోటోను షేర్ చేశారు. దీనితో అభిమానులు ఆమెను ఊరడిస్తూ, మీరు పోరాటయోధురాలు. త్వరలోనే ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.