Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘సంపద పెంపుకి అర్థం అదే’..జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సంపద పెంపుపై వ్యాఖ్యానించారు మాజీ సీఎం, వైసీపీ నేత జగన్. ముఖ్యమంత్రి దృష్టిలో సంపద పెంపు అంటే తనవారికి, సొంతవారికి ఆస్తులు పెంచడమేనని ఎద్దేవా చేశారు. “ప్రభుత్వ అధీనంలోని మద్యం షాపులన్నీ తనవాళ్లకే ఇప్పించుకున్నారు.  ప్రభుత్వ రంగంలోని మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేశారు. ఇసుకలోనూ స్కామ్ జరుగుతోంది. ఫ్రీ ఇసుక పేరు చెప్పి ఇసుక రేట్లు రెండింతలయ్యాయి.  పెద్దబాబు చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ కలిసి, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి వాటాలు పంచుకుంటున్నారు అని ఆరోపించారు. అసలైన సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ రద్దు చేశారు. కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమాన్ని మొబైల్ అడ్వాన్స్‌ల పేరు పెట్టి అన్యాయాలకు తెర లేపారు. ఇలా ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతుంటే చంద్రబాబు ఆదాయం పెరిగిపోతోంది” అంటూ విమర్శలు కురిపించారు.