కేరళలోని ఫ్యాన్స్‌ను కలిసిన తలైవా
తలైవా రజనీకాంత్ అంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. 70 ఏళ్ల పైబడినా భ్యారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ షూటింగ్ నిమిత్తం కేరళలోని తిరువనంతపురం వస్తున్నారని తెలియడంతో అభిమానులు భారీగా లొకేషన్‌కు వచ్చేశారు. తలైవా, తలైవా అంటూ కేకలు పెట్టారు. ఆయన భేషజాలకు పోకుండా తన ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆదరిస్తారని అందరికీ తెలిసిందే. అభిమానులను అందరినీ పలకరించి అభివాదం చేశారు రజనీ. ఆయన తన 170 వచిత్రంలో నటుస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త గెటప్‌లో కనిపించారు. యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఈ చిత్రానికి టి. జి. జ్ఞానముత్తువేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో రానుందని సమాచారం.

