పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం..
పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం రేకెత్తించారు. స్లీపర్ సెల్స్ ద్వారా ఉగ్రదాడి చేయడానికి ప్రయత్నించిన ఐఎస్‌ఐ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దేశం మొత్తం ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని టిబ్బా నంగల్- కులర్ రోడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబులు, ఐదు పీ-86 హ్యాండ్ గ్రైనేడ్‌లు, రెండు రాకెట్ గ్రైనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. స్లీపర్ సెల్స్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దీనితో పంజాబ్ రాష్ట్రం అలెర్టయ్యింది.