ముంబయి ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదుల కలకలం..
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు కనిపించడం కలకలం సృష్టించింది. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ప్రతీ ఎయిర్ పోర్టులో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలలో శుక్రవారం రాత్రి టెర్మినల్ 2 వద్ద వీరు అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. వీరిద్దరికీ ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇండోనేషియాలోని జకార్తా నుండి భారత్‌కు వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్‌లుగా వారిని గుర్తించారు. వీరిద్దరూ 2023లో పూణేలో ఇంప్రూవైజ్డ్ డివైసెస్ తయారీకి సంబంధించిన కేసులో స్థానిక పోలీసులు ఇప్పటికే వీరిని వెతకుతున్నారు. వీరు స్లీపర్ సెల్స్‌తో దేశంలో ఉగ్రకుట్రలకు ప్లాన్ చేశారు.