ఆ దేశం కోసమే ఉగ్రవాదం..పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదులను పెంచి, పోషిస్తున్నట్లు స్వయంగా ఒక ఇంటర్యూలో ఒప్పుకోవడం వివాదాస్పదమైంది. పైగా ఈ నీచమైన పనులన్నీ అమెరికా కోసమే చేస్తున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. పహల్గాం దాడి ఘటన తర్వాత మీడియాకు ఇంటర్యూ ఇస్తూ అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమదేశాల కోసమే పాకిస్తాన్ 3 దశాబ్దాలుగా ఈ చెత్తపనులన్నీ చేస్తున్నాం. సోవియట్ యూనియన్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చేరకపోయి ఉంటే బాగుండేది అన్నారు. లష్కరే తోయిబా ఇప్పుడు మా దేశంలో లేదన్నారు. పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ పహల్గాం దాడికి పాల్పడినట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే.

