కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత..
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆ మండలంలో మా పార్టీ అభివృద్ధి చేసిందంటే, మాపార్టీ అభివృద్ధి చేసిందంటూ బహిరంగంగా వాదులాడుకున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో గొడవలు పెట్టుకున్నారు. మంగళవారం కాంగ్రెస నేతలు చర్చలకు నంది మేడారంలో ప్లాన్ చేసుకున్నారు. అప్పడే బీఆర్‌ఎస్ నేతలు కూడా ధర్మారం బస్టాండ్ ముండి ప్రధాన కూడలికి బయలుదేరడంతో పోలీసులు వారిని మధ్యలో అడ్డుకున్నారు. దీనితో వాగ్వాదాలు, పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ప్రమేయంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బయలుదేరారు.