Home Page SliderNationalNews Alert

బస్‌ స్టాప్‌లో వేచి ఉన్న మహిళల్ని చూసి కూడా బస్సు ఆపని డ్రైవర్‌పై వేటు..

Share with

మహిళా ప్రయాణికులకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను ఎక్కించుకునేందుకు పురుష డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల తరుచూ వెలుగు చూస్తున్నాయి. బస్టాప్‌లో వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపని సదరు డ్రైవర్‌పై ఢిల్లీ సర్కార్‌ వేటు వేసింది. బస్టాపులో ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్‌.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా బస్సు ముందుకు సాగింది. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలఓ వైరల్‌ కావడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్‌ చేసింది. పురుష, మహిళ డ్రైవర్లు స్టాపుల్లో బస్సును ఆపాల్సిందేనన్నారు. మహిళల కోసం ఆపని సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనను వీడియో తీసి షేర్‌ చేస్తే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు.