అమెరికా అధ్యక్షుని హత్యకు కుట్ర పన్నిన తెలుగబ్బాయి
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్నింది, ప్రయత్నించింది ఒక భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతని పేరు సాయి వర్షిత్ అని తెలుగు అబ్బాయి అని పేర్కొన్నారు. ఈ విషయం సంచలనంగా మారింది. ఈ హత్యకు ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు చెప్తున్నాడు సాయివర్షిత్. అధ్యక్షభవనం వైట్‌హౌస్ వద్ద బారికేడ్లను దూసుకుంటూ అతివేగంగా వచ్చిందో ట్రక్. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న వైట్ హౌస్‌లో ప్రవేశించడమే కాక ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ట్రక్కును వెనక్కి తీసుకుని మళ్లీ అతివేగంగా దూసుకువచ్చాడు. తన వద్ద గల స్వస్తిక్ గుర్తుగల నాజీ జెండాను బయటకు తీసాడు. కేవలం ఈ పంతొమిదేళ్ల ఈ యువకుడు ఎందుకిలా చేసాడంటూ ప్రశ్నించారు పోలీసులు. జోబైడెన్‌ను చంపడమే తన లక్ష్యమని, అనంతరం అధికారాన్ని తన చేతుల్లో తీసుకుంటానంటూ ధైర్యంగా బదులిచ్చాడు. డ్రైవర్‌తో పాటు అతనిని కూడా అరెస్టు చేశారు అధికారులు. నాజీ జెండా అతనివద్ద ఎందుకుంది? అతని వెనుక ఎవరున్నారు ?అనే విషయాలు ఆరాలు తీస్తున్నారు. అయితే అధ్యక్షుడిని చంపితే, తాను అధ్యక్షుడిని అవగలనని అనుకోవడంతో అతడు మతి స్థిమితం లేనివాడేమో? అనే అనుమానం కలుగుతోంది. దర్యాప్తు కొనసాగుతోంది.