తెరపైకి తెలంగాణ కొత్త అసెంబ్లీ భవన్
ఏపిలో అరెస్టుల పర్వం సాగుతుంటే…తెలంగాణాలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.హైడ్రా పేరుతో అనుమతులు లేని భవనాలు,భవన సముదాయాలను కూల్చివేస్తున్నారు.అంతే కాదు రేవంత్ క్యాబినెట్ మంత్రులు కొత్త ప్రపోజల్ ని తెర మీదకు తెచ్చారు. మళ్లీ అసెంబ్లీ నిర్మాణ వివాదాన్ని తీసుకొచ్చారు. తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం అవసరం అంటూ రాగం అందుకుంటున్నారు. సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందని మ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ నిర్మాణానికి అవసరమైతే FTL పరిధిని కుంచించవచ్చంటూ ఏకంగా సలహా కూడా ఇచ్చేశారు. సచివాలయం, అసెంబ్లీ, అమరవీరులస్థూపం, హుస్సేన్‌సాగర్ ఒడ్డున చూడచక్కగా ఉంటాయని పేర్కొన్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కపక్కనే ఉంటే పాలనపరంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.అయితే వాయిస్ ఎమ్మెల్యేదే అయినప్పటికీ.. ఆశయం మాత్రం సీఎం రేవంత్ రెడ్డిదేనని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

